🙏🏻 ఓం శ్రీమాత్రే నమః 🙏🏻: పోతనామాత్యుని భాగవత గ్రంథం దశమస్కంధం లోని మధురఘట్టాలు - 6 . పలికెడిది భాగవతమఁట, పలికించెడివాడు రామభద్రుండఁట, నేఁ బలికిన భవహర మగునఁట, పలికెద, వేఱొండు గాథ బలుకఁగ నేలా? దశమ స్కంధము. కం. పంకజముఖి నీళ్ళాడను సంకటపడ ఖలులమానసంబుల నెల్లన్ సంకటము దోచె ; మెల్లన సంకటములు లేమి తోచె సత్పురుషులకున్. పద్మం వంటి ముఖం గల దేవకి, కృష్ణుని కనడానికి ప్రసవవేదనలు పడుతుంటే, దుష్టుల మనస్సులలో ఏదో తెలియని ఆవేదన కలిగింది. మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలగిపోతున్న సూచనలు, కనిపించాయి. సీ. స్వచ్ఛంబులై పొంగె జలరాసు లేడును; గలఘోషణముల మేఘంబు లుఱిమె; గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె; దిక్కులు మిక్కిలి తెలివిఁ దాల్చెఁ; గమ్మని చల్లని గాలి మెల్లన వీఁచె; హోమానలంబు చెన్నొంది వెలిఁగెఁ; గొలఁకులు కమలాళికులములై సిరి నొప్పెఁ; బ్రవిమలతోయలై పాఱె నదులు; తే. వర పుర గ్రామ ఘోష యై వసుధ యొప్పె; విహగ రుత పుష్ప ఫలముల వెలసె వనము; లలరుసోనలు గురిసి ర య్యమరవరులు; దేవదేవుని దేవకీదేవి గనఁగ. దేవకీదేవి శ్రీకృష్ణభగవానుని ప్రసవిస్తున్నట్టి ఆ సమయంలో ఏడు సముద్రాలూ ఉప్పొంగాయి. మేఘాలు ఆనందంతో ఉరుముల చాటింపు వేసాయి. ఆకాశం గ్రహాలతో తారకలతో ప్రకాశించింది. దిక్కులన్ని దివ్యకాంతులతో నిండిపోయాయి. చల్లగాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. హోమగుండాలలోని అగ్ని జాజ్వల్యమానంగా వెలిగింది. తుమ్మెదలతో కూడిన పద్మాలగుంపులతో సరోవరాలు కళకళ లాడాయి. నదులు నిర్మలమైన నీటితో ప్రవహించాయి. శ్రేష్ఠమైన నగరాలు, గ్రామాలు, గొల్లపల్లెలతో భూదేవి వెలిగి పోయింది. పక్షుల కిలకిలారావాలతో, పూలతో, పండ్లతో, ఉద్యానవనాలు, అరణ్యాలు విలసిల్లాయి. దేవతలు పుష్పవర్షాలు కురిపించారు. శ్రేష్ఠులైన గంధర్వులు దివ్యగానాలు చేసారు. రంభ మొదలైన అప్సరసలు నృత్యాలు చేసారు. సిద్ధులు ఆనందంతో గుంపులు గుంపులుగా చేరారు. చారణులు భయం తీరి ఆనందించారు. దేవతలు ఉత్సాహంగా భేరీలు మోగించారు. శ్రీకృష్ణ జననం అందరికీ ఆనందదాయకంగా వున్నది. కం. సుతుఁ గనె దేవకి నడురే యతి శుభగతి దారలును గ్రహంబులు నుండన్ దితిసుతనిరాకరిష్ణున్ శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్. దేవకీదేవి అర్థరాత్రివేళ నక్షత్రాలు, గ్రహాలు, అత్యంత శుభస్థానాలలో ఉండగా, రాక్షసులను శిక్షించేవాడు, ఆశ్రయించిన వారి ముఖాలలో ఆనందం నింపేవాడు, జయకారుడు; విశ్వం అంతా వ్యాపించి ఉండువాడు, అయిన శ్రీమహావిష్ణువును ప్రసవించింది. కం. వెన్నుని నతిప్రసన్నుని గ్రన్నన గని మెఱుగుబోడి గడు నొప్పారెం బున్నమనాడు కళానిధి గన్న మహేంద్రాశ చెలువు గలిగి నరేంద్రా! ఓ రాజా ! శ్రీ కృష్ణుని, అతి ప్రసన్న వదనంతో వున్నవాడిని, ప్రసవించి, దేవకి మెరుపుతీగలా మెరిసిపోతూ, మిక్కిలి అందంగా ఉన్నది. ఆ సమయంలో, దేవకి నిండుపౌర్ణమినాటి పదహారు కళలతో నిండిన చంద్రుని కలిగివున్న, తూర్పుదిక్కు అంత అందంగా వున్నది. అప్పుడు, విష్ణుమూర్తి, బాలుని వలే, ఎలా దర్శనమిచ్చాడనగా.... సీ. జలధరదేహు నాజానుచతుర్బాహు; సరసీరుహాక్షు విశాలవక్షుఁ జారు గదా శంఖ చక్ర పద్మ విలాసుఁ; గంఠకౌస్తుభమణికాంతి భాసుఁ గమనీయ కటిసూత్ర కంకణ కేయూరు; శ్రీవత్సలాంఛనాంచిత విహారు నురుకుండలప్రభాయుత కుంతలలలాటు; వైడూర్యమణిగణ వరకిరీటు తే. బాలుఁ బూర్ణేందురుచిజాలు భక్తలోక పాలు సుగుణాలవాలుఁ గృపావిశాలుఁ జూచి తిలకించి పులకించి చోద్య మంది యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె. ఆ బాలుడు దివ్యరూపంతో, వసుదేవునికి దర్శనమిచ్చాడు. అతడు నీలమేఘ వర్ణ దేహం కలిగివున్నాడు. పొడవైన నాలుగు చేతులలో, గద శంఖం చక్రం పద్మం వెలుగొందుతున్నాయి. తామరరేకులవంటి కళ్ళు, విశాలమైన వక్షం ఉన్నాయి. కంఠంలో కౌస్తుభమణి కాంతులు వెలుగుతున్నాయి. అందమైన మొలతాడు, కంకణాలు, భుజకీర్తులు ధరించి ఉన్నాడు. శ్రీవత్సము అనే పుట్టుమచ్చ వక్షం మీద మెరుస్తున్నది. చెవికుండలాల కాంతితో ముంగురులు వెలిగిపోతున్నాయి. మణులు పొదగిన కిరీటం ధరించి ఉన్నాడు. పూర్ణచంద్రుని కాంతులీనుతున్నాడు; భక్తులందరిని రక్షించేవాడు; సృష్టిలోని సుగుణాల పోగు. అతి విశాలమైన కరుణ కలవాడు అయిన హరిని వసుదేవుడు చూడగానే, పులకించి, ఆశ్చర్యంతో మైమరచి, ఉప్పొంగి, ఉబ్బితబ్బిబయ్యాడు. తామువున్న పరిస్థితులలో, స్నానం చేయడం వీలుకాకపోవుట చేత, ఆనందరసమనే సముద్రంలో మునిగి తేలుతున్న వసుదేవుడు, బ్రాహ్మణులకు, ' పదివేల ఆవులు దానం చేస్తున్నాను. ' అని మానసికంగా ధారపోసాడు. వసుదేవుడు ' పురిటింటికి దీపంలా వెలుగొందుచున్న ఈ బిడ్డడు నిజానికి చతుర్ముఖ బ్రహ్మని సృష్టించిన మహానుభావుడు అయిన విష్ణుమూర్తే. ' అని అనుకొన్నాడు. భక్తితో సాష్టాంగపడి నమస్కారం చేశాడు. లేచి రెండుచేతులనూ తామరమొగ్గల వలె నుదురు పై జోడించాడు. పసిపిల్లాడు అని వెనుదీయకుండా, అతని దివ్యచరిత్రలు అన్నీ తలచుకొని పొగడసాగేడు. సర్వమునకు ఈశ్వరుడైన భగవంతుడా ! సర్వము నీలోనే వున్నది. సర్వమునకు ఆత్మ అయినవాడవు నీవు. నీచేత తయారైన ప్రాణులతో, సర్వము నిండి ఉన్నది. అట్టి నీకు లోపల, మధ్య, బయట అన్న బేధాలు లేవు. ఈశ్వరా ! ఆత్మ నుండి శరీరం మనస్సు మొదలైనవి పుట్టుకొస్తాయి. వాటిని ఆత్మకన్న వేరైనవి అనుకొనేవాడు పరమమూర్ఖుడు. విశ్వమంతా నీవే. నీవు కానిది వేరే ఏమిలేదు. ఈశ్వరా ! నీ వలన జగత్తు పుడుతుంది. అయితే ఆ జగత్తుకు అవసరమైన త్రిగుణాలుగాని, వాటి మార్పులుగాని నీకులేవు. సృష్టి చేయాలనే కోరికకూడ నీకులేదు. నీ వలననే పుట్టిన జగత్తు, నీ వలననే వృద్ధిచెంది నీ యందే లయమౌతుంది అనడం పొరపాటు కాదు. సర్వాతీతుడవై, బ్రహ్మము అయిన నీవు తమప్రభువు అని నీ ఆఙ్ఞను లోకమంతా అనుసరిస్తుంది. లోకంలో భటుల శౌర్యం, ప్రభువు శౌర్యంగానే ప్రసిద్ధికెక్కుతుంది. అలాగే నీమాయతో కూడిన గుణాలు, వాటి గొప్పదనాలు నీవిగా తోస్తాయి. నీవు రజోగుణ రూపుడవై సృష్టిచేస్తూ ఉన్నప్పుడు, ఎఱ్ఱనిరంగుతో కూడి ఉంటావు. సత్త్వగుణ రూపుడవై సృష్టిని రక్షిస్తూ ఉన్నప్పుడు తెల్లని రంగుతో కూడి ఉంటావు. తమోగుణ రూపుడవై సృష్టిని లయంచేస్తూ ఉన్నప్పుడు నల్లని రంగుతో కూడి ఉంటావు. ఇవన్నీ నీవు ధరించే పాత్రలు. అలాగే ఇవాళ కూడ దుష్టులను దండించడానికి భూమిపై మానవుడుగా అవతరించావు. ఆకాశవాణి మాటలు కంసుని ధైర్యాన్ని కూలద్రోశాయి. ఆనాటి నుండి నువ్వు నా యింట పుట్టబోతున్నావని భయపడి, వాడు నీ అన్నలను అందరిని సంహరించాడు. ఇప్పుడు నువ్వు పుట్ట బోతున్నావని తెలిసి, కంటికి కునుకు లేకుండ ఉన్నాడు. నువ్వు పుట్టావని కారాగారభటులు చెప్తే తాత్సారం చేయడు. వెంటనే నీమీదకి విరుచుకు పడటానికి సిద్ధమై వచ్చేస్తాడు.” ఇలా వసుదేవుడు అనుకుంటూ ఉండగా, దేవకీదేవి కొడుకును చూసింది. ఆ బాలుడు మహాపురుషుల సాముద్రిక లక్షణాలు కలిగి ఉన్నాడు. అతడు చక్కని చూపులు కలవాడు, చాలా సుకుమారుడు. కంసుని పేరు వినబడగానే, తల్లి మనసుతో, దేవకీదేవి భయపడింది. వెంటనే, స్వచ్ఛమైన చిరునవ్వుతో, ఆ దేవదేవుని వంక చూసి, పరిపరివిధాల కీర్తించింది. పద్మాక్షా ! ప్రాచీనకాలం నుంచీ మహాయోగీశ్వరులు, ' ఒంటరిగా యోగమార్గంలో అత్యంత తీవ్రసాధనచేసి నిన్ను చూసాము .' అంటారు. కాని వారు చూసింది, తాము చూడదలచిన రూపాన్నే కాని, నీవు అనుగ్రహించే ఈ రూపాన్ని కాదు. నీవు దర్శనమిచ్చిన నీ ఈ రూపాన్ని భద్రంగా చూసి తరించాను ప్రభూ ! . ఈ భౌతికమైన కన్నులతో నీ ఈ దివ్యరూపాన్ని చూడడం కష్టంగా వున్నది. నీకు నమస్కరిస్తాను. సర్వస్వానికి ఆధారమైన ఈ నీ రూపాన్ని ఉపసంహరించు. ' ' సృష్టి అంతా ప్రళయంలో లీనమైపోయినప్పుడు, ఈ సమస్తమైన విశ్వాన్ని కడుపులో దాచుకున్న సమర్థుడవైన మహా నటుడవు. అలాంటి పరమపురుషుడవు, నీవు నాకడుపున పుట్టడం నీ మాయమాత్రమే కదా ! పరమపురుషా ! కమలదళాల లాంటి చక్కని కన్నులు గల దేవా ! నీవు నా కడుపున పుట్ట బోతున్నావని విని, దుర్మార్గుడు కంసుడు చాలాకాలంగా మమ్మల్ని ఇలా కారాగారంలో, పెట్టి బాధ పెడ్తున్నాడు. మలినచిత్తంతో మసలుతున్న వాడిని శిక్షించు. భయభ్రాంతులము అయిన మమ్ము రక్షించు. నీ పుట్టుకతో మేము నోచిన నోములు అన్నీ లోటులేకుండ పరిపూర్ణంగా పండాయి స్వామీ. ' అని చెప్పుకొంది దేవకీదేవి. ఇలా దేవకీదేవి విన్నవించగా విష్ణుమూ ర్తి ' అమ్మా ! పూర్వం స్వాయంభువ మన్వంతరంలో “పృశ్ని” అనే మహాపతివ్రతవు నువ్వు. అప్పుడు “సుతపుడు” అనే ప్రజాపతే వసుదేవుడు. మీరిద్దరు సృష్టికాలంలో బ్రహ్మదేవుని ప్రేరణతో మహాతపస్సు చేసారు. ఇంద్రియాలను జయించారు. గాలి, వాన, ఎండ, చలి మొదలైన వానిని సహించారు. ఏకాంతగా ఉంటూ ఆకులు అలములు తిని తీవ్రమైన తపస్సు చేసారు. అలా పన్నెండువేల దివ్యసంవత్సరాలు తపస్సు చేయగా, మీ రూపాలు కాంతివంతమైనాయి. నిష్ఠగా నా నామజపం చేస్తూ, నా తత్వాన్ని సమీపించగలిగారు. నన్ను బహునిష్ఠగా పూజించారు. అప్పుడు నా సత్యరూప దర్శనం మీకు ఇచ్చి, మంచి వరాలు కోరుకోమన్నాను. అప్పటికి మీకు పిల్లలు లేరు. అయితే ఆ సమయంలో నా మాయ మిమ్మల్ని ఆవహించింది. కనుక, మోహంతో తిరుగులేని మోక్షం కోరుకోకుండా, నాతో సాటియైన కొడుకును ప్రసాదించమని వరం కోరుకొన్నారు. నేను మెచ్చి అలాగే వరమిచ్చాను. నా సాటి వేరొకడు లేడు కనుక నేనే మీకిద్దరికి “పృశ్నిగర్భుడు” అనే పేరుతో కొడుకుగా పుట్టాను. రెండవ జన్మలో మీరు "అదితి", "కశ్యపుడు" అనే పేర్లు గల ప్రసిద్ధ మైన దంపతులు. అప్పుడు నేను, మరుగుజ్జు రూపంతో "వామనుడు" అనే పేరుతో మీకు జన్మించాను పూర్వం నేను చెప్పనట్లుగానే మూడవ జన్మలో, ఇప్పుడు మీ దంపతులకు పుత్రుడుగా జన్మించాను. ఇకపై మీయందు, నాకు పుట్టుకలేదు. నన్ను మీరు కుమారుడని తలచుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను అనుగ్రహించిన దర్శనం వలన పరమానంద స్వరూపుడైన, ' పరబ్రహ్మము ' నేనే అని అనుకుంటూ ఉంటారు. ఆ నిరంతర స్మరణ వలన నా అద్భుతమైన లోకాన్ని పొందుతారు. నా యందు మీకున్న ప్రేమ వలన ఇకపై మీరు జన్మ ఎత్తరు. అని ఈ విధంగా చెప్పిన పిమ్మట విష్ణుమూర్తి, ఆ చతుర్భుజ రూపాన్ని విడిచిపెట్టాడు. పరీక్షిన్మహారాజా ! ఈ విధంగా విష్ణుమూర్తి చెప్పిన తరువాత, . దేవకీవసుదేవులు ఆశ్చర్యచకితులై, కన్నార్పకుండ చూస్తుండగా హరి, మాయను ఆవరింపజేసుకొని, ఆ దివ్యరూపాన్ని వదలి అప్పుడే పుట్టిన పసిబిడ్డ రూపం ధరించాడు. బాల్యచేష్టలతో, కొన్ని వేడుకలు చేసాడు. అప్పుడు వసుదేవుడు తాను చేయవలసిన పనులను శ్రీహరి సంకల్పం వలన గ్రహించాడు. వెంటనే, మహారాజా ! అప్పుడు శిశురూపి అయిన విష్ణుని తీసుకొని, వసుదేవుడు, పురిటిల్లు దాటించి త్వరత్వరగా తీసుకుపోవాలని గ్రహించాడు. అదే సమయంలో వ్రేపల్లె లోని నందుని భార్య యశోదాదేవి యోగమాయను, ఆడబిడ్డగా ప్రసవించింది. అప్పుడే వసుదేవుడు పసిబిడ్డను చక్కగా చేతులతో ఎత్తుకొని, రొమ్ముకు అడ్డంగా హత్తుకొన్నాడు. చప్పుడు చేయకుండ మెల్లమెల్లని అడుగలు వేస్తూ, గభాలున కావలి వాళ్ళు ఉండే ఆవరణ దాటాడు. చటుక్కున పురిటిల్లు నుంచి బయటపడ్డాడు. అక్కడ, వ్రేపల్లెలో. కం. నందుని సతికి యశోదకు బొందుగ హరి యోగమాయ పుట్టిన మాయా స్పందమున నొక్క యెఱుగమి క్రందుకొనియె నూరివారి గావలివారిన్. నందుడి భార్య యశోదకి యోగమాయ చక్కగా పుట్టింది. వెంటనే వ్రేపల్లెలో ఊరివారిని, కావలివారిని అందరిని విష్ణుమాయ ఆవరించి, చిత్రమైన మైకం కమ్మింది. వసుదేవుడు పురిటింటిని దాటి, నెమ్మదిగా అడుగులు వేస్తూ, చడీచప్పుడు కాకుండా వస్తున్నాడు. విష్ణుమాయ వలన కాళ్ళకి చేతులకి ఉన్న ఇనపగొలుసులు, సంకెళ్ళు అతుకులు వీడి ఊడిపోయాయి. ఆ మహామహిమాన్వితుని సంకల్పానికి అడ్డు రాలేక తలుపుల తాళాలు కీళ్ళు ఊడి పడిపోయాయి. ద్వారాలు వాటంతట అవే తెరుచుకున్నాయి. వసుదేవుడు మెల్లమెల్లగా ముందున్న చావళ్ళు అన్నీ, దాటాడు. తిన్నని పొడుగైన చావళ్ళు వున్నా, శ్రీహరి మాయవలన ఎవరూ చూడలేదు. వసుదేవుడు ఇలా చావళ్ళు దాటుతుంటే, ఆదిశేషుడు ఆ ద్వారాలని మూస్తూ, వెనువెంట వస్తున్నాడు. పడగలు విప్పి, ఆ బాలునికి గొడుగులాపట్టి వెనుకనించి ఎలాంటి ఆపదా రాకుండా కాస్తూ అనుసరిస్తున్నాడు. వసుదేవుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. కం. ఆ శౌరికిఁ దెరువొసగె బ్ర కాశోద్ధత తుంగ భంగ కలిత ధరాశా కాశ యగు యమున మును సీ తేశునకు బయోధి త్రోవ యిచ్చిన భంగిన్. శూరుని పుత్రుడైన వసుదేవుడు, అప్పుడే పుట్టిన శిశువుని రేపల్లెకు తరలిస్తూ, యమున దగ్గరకు వచ్చాడు. ఎగిసిపడుతున్న పెద్దపెద్ద అలలతో భూమినుండి ఆకాశందాకా నాలుగుదిక్కులా కమ్ముకుంటూ ప్రవహిస్తూ వున్న యమునానది త్రేతాయుగంలో, శ్రీరామునికి లంకాపురం వెళ్ళటానికి సముద్రుడు త్రోవ యిచ్చినట్లే, శిశురూపి శ్రీకృష్ణ భగవానునికి, యమున దారి యిచ్చింది. వసుదేవుడు, బాలునితో క్షేమంగా వ్రేపల్లెకు, నందుని ఇంటికి చేరాడు. దేవకీనందన శ్రీసో నందగోప ప్రియాత్మజా / యమునా వేగ సంహారీ బలభద్రప్రియానుజా // శ్రీ వత్స కౌస్తుభ ధరీ యశోదా వత్సలో హరీ / చతుర్భుజాస్త చక్రాసీ గదా శంఖాద్యుధాయుధ : //

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

🕉🌺 ఆధ్యాత్మికం🌺🕉 @aadyaatmikam360°: “మైలాపూర్ లో కపాలీశ్వర దేవాలయం ఉంది. సాయింత్రాలు అక్కడకు వెళ్ళు. పడమర గోపురం దగ్గర రోజూ చత్త ఊడ్చి, నీళ్ళు చెల్లు. నీకు పది రూపాయలు, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయిస్తాను” “ఈ ఊడిగాలు, ప్రసాదాలు అవన్నీ నాకు పడవు” “దేవాలయ ప్రసాదం కాదు. రోజుకొక భక్తుని ఇంట నీ భోజనం ఏర్పాటు చేస్తాను. నువ్వు ఆ పది రూపాయలతో రాత్రిపూట తిను” “నాకు అవన్నీ సరిపడవు. నావల్ల కుదరదు” “అంత ఆత్రుత ఎందుకు? మఠంలో రెండు రోజులు ఉండు. చంద్రమౌళిశ్వర పూజ చూడు. పూజ అయిన వెంటనే నీకు ఆహారం ఏర్పాటు చేయిస్తాను. తరువాత ఆలోచించి చెప్పు” “ఈరోజు నాకు కుదరదు. ఎగ్మోర్ కోర్టులో ఒక పెద్ద కేసు ఉంది. నేను అక్కడకు సాక్ష్యం చెప్పడానికి వెళ్ళకపోతే, నా వీపు విరగ్గొడతారు. నన్ను వెళ్ళనివ్వండి” అని అతను వెళ్ళిపోయాడు. ఆ ప్రహరి దాటి వెళ్లిపోఏంతవరకు అలా చూస్తుండిపోయారు. తరువాత స్వామివారు లేచి లోపలకు వెళ్ళారు. నిలకంఠ అయ్యర్, నేనూ వెనకాతలే వెళ్ళాము. స్వామివారు తిరిగి చూశారు. నిలకంఠ అయ్యర్ చిన్నగా అన్నారు, “మహాస్వామి వారు అంతగా చెప్పినా అతను వినిపించుకోలేదు” “అలాగే ఉండని. జనాలకు తప్పుడు సాక్ష్యం చెప్పడం అలవాటు చేశారు ఈ పోలీసులు” అన్నారు స్వామివారు. అందుకు నిలకంఠ అయ్యర్ “వారు మాత్రం ఏం చేస్తారు? పట్టపగలే అంతమంది ముందు ఒక హత్య జరిగినా కూడా ఎవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకురారు. అది ఎవరు చేశారో తెలిసి కూడా ఎవరూ సాక్షిగా రావడానికి ఒప్పుకోరు. అందరికి వాళ్ళ వాళ్ళ పనులు ఉన్నాయి. పోనీ అలా వెళ్ళినా ఈ లాయర్లు వారిని పదే పదే కోర్టుల చుట్టూ తిప్పుతారు. తీరా నిందితుడే ఒప్పుకున్నా, సాక్ష్యం లేదని కేసు కొట్టేస్తారు. తరువాత పొలిసు వ్యవస్థ సరిగా లేదని. కనుక వారికి తప్పుడు సాక్ష్యం చెప్పించడం తప్ప వేరే దారి లేదు” “ఓహో! నేరం చెయ్యడం మొదటి తప్పు. చూసి కూడా సాక్ష్యం చెప్పడానికి రాకపోవడం రెండవ తప్పు. చూడనివారిని సాక్ష్యంగా తయారుచెయ్యడం మూడవ తప్పు. ఈ తప్పులను సమర్తిచడం మరొక తప్పు” “మహాస్వామి వారు నన్ను మన్నించాలి. ప్రపంచంలో జరుగుతున్నడి నేను తెలిపాను అంతే” “ఇది మరీ బాధాకరం. ఇదంతా ఒక బ్రాహ్మణుని విషయంలోనా! తప్పుడు సాక్ష్యం చెప్పినా ఒక బ్రాహ్మణుడు చెబుతున్నాడు అంటే కోర్టు కూడా నమ్ముతుందనే కదా పోలీసులు ఇలా చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ! ఆ శ్రౌతి మనుమడు ఇలా . . .” “మహాస్వామి వారు చేప్పినదేదీ అతని చెవిన పడలేదు” “చెప్పాడు కదా. కోర్టుకు వెళ్ళకపోతే పోలీసులు కొడతారు అని. అతడెంచేస్తాడు” “పరమాచార్యుల వారు చాలా క్లేశ పడుతున్నారు. మేమేమైనా చెయ్యగలమా?” “ఒక సన్యాసి తన మనస్సులో సుఖదుఖాలకు కష్టనష్టాలకు తావివ్వకూడదు అని మీకు తెలుసు కదా” అని స్వామివారు స్నానానికి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం మూడు గంటలప్పుడు పూజగది పక్కన ఉన్న వరండాలో నేను పడుకుని ఉన్నాను. “రామా!” అని అరుపు వినబడడంతో లేచి వచ్చాను. మేలూర్ మామ - రామచంద్ర అయ్యర్ - మహాస్వామి వారి పూజా పర్యవేక్షకులుగా ఉన్నారు. చాలా సంప్రదాయం పాటించే మనిషి. పూజ సహాయకులకు ఆయన సింహస్వప్నం. పూజకట్టులో చిన్న పొరపాటును కూడా సహించరు. దేవతా మూర్తులను లోపల పెట్టి తాళం వేసిన తరువాత కూడా వాటిని పర్యవేక్షిస్తుంటారు. వారు లోపల నుండి పెద్ద ఇత్తడి గిన్నెతో బయటకు వచ్చారు. నన్ను అక్కడ చూసి రమ్మని సైగ చేశారు. “ఉదయం పరమాచార్య స్వామివారితో పాటుగా వచ్చావా?” అని అడిగారు. “అవును వారితోపాటే వచ్చాను” “అప్పుడు ఏమైనా జరిగిందా?” “ఏమిలేదు” “లేదు. ఏమో జరిగింది. మహాస్వామి వారు ఈరోజు పూజ చెయ్యలేదు” “అలాగా! అది ఏం జరిగిందంటే. . .” అని పరవాక్కరై శ్రౌతిగళ్ మనవడి గురించి మొత్తం జరిగినదంతా చెప్పాను. చేతిని నుదిటిపై బాదుకుంటూ ఆయన చలించిపోయారు. అప్పుడే స్వామివారు అటువైపుగా వచ్చారు. నేను నమస్కరించాను. “మేలూర్ మామ ఏం చెప్పాడు. చూస్తె ఈరోజు భోజనం చేసినట్టు లేదు. ఏమైనదో కనుక్కున్నావా?” అని అడిగారు. నేను కళ్ళు తుడుచుకున్నాను. “నాతో ఎదో చెప్పాలని అనుకుంటున్నావు కదా! చెప్పు మరి” “నేనేమి చెప్పగలను పెరియవా! శ్రీధర అయ్యవాళ్ శ్లోకం ఒకటి స్ఫురించింది” “అయ్యవాళ్ శ్లోకమా? భక్తి రసంలో ముంచుతుంది. ఏది చెప్పు ఒకసారి” “త్వన్ నామధ్యేయ రసికాః తరుణేందు మౌళే దుఃఖం న యాన్తి కిమపీతి హి వాదమాత్రం దేశమీకిల స్వవిపతీవ వహంతి దుఃఖం త్రుకోకరీభవతి దుఖాని జంతుమాత్రే” “మరొక్క సారి చెప్పు!” నేను మరలా చెప్పాను. “అర్థం కూడా చెప్పు చూద్దాం” “తలపై నెలవంకను ధరించిన స్వామి ఎవరో ఆ స్వామి పేరు శివా శివా అని తలచిన వారికి దుఃఖము కలగదు అని. కాని వారు కూడా ఇతరుల కష్టములను చూసి చలించిపోతారు. అదేదో ఆ కష్టము వారికే వచ్చింది అన్నట్టుగా” “సరిగ్గా చెప్పావు. ఇందులో నువ్వు ఒకటి గమనించావా?” “దేని గురించి? నాకు తెలియదు” “ఇక్కడ “తరుణేందు మౌళే” అని అంటున్నాడు. అది మన చంద్రమౌళీశ్వరుడే. వారి గురువు అయిన బోధేంద్ర సరస్వతీ పూజించిన చంద్రమౌళీశ్వరుని పైనే ఇలా కీర్తించాడు” అని చెప్పి స్వామివారు తాదాత్మ్యం చెందారు. నేను స్వామివారికి ఒక విషయం చెప్పదలచుకున్నాను. అది చెప్పి ఉంటే అది అపచారము అయ్యి ఉండేదేమో. అందుకే ఇక్కడ చెబుతున్నాను. వేరొకరి బాధలకు చలించిపోయే మాహామనీషి పుట్టబోతున్నాడని మూడువందల యాభై సంవత్సరాల క్రితమే శ్రీధర అయ్యవాళ్ చంద్రమౌళీశ్వరునికి చెప్పుకున్నాడు. --- వి. విశ్వనాథ ఆత్రేయన్, మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1 అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్ శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

*Kartika Puranam - 29* *కార్తీక పురాణము - ఇరవై తొమ్మిదవ అధ్యాయము* రాజు చూచుచుండగానే సుదర్శన చక్రమంతర్థానము పొందెను.సుదర్శన చక్రము అంతర్థానము పొందిన తర్వాత అంబరీషుడు భక్తితో దుర్వాసునకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తిచేత పులకాంకితుడై తన శిరమును ముని పాదములపైన బడవేసి, బ్రాహ్మణోత్తమా!నేను మహాపాపిని, పాపమునందు మునిగి ఉండి కష్టించుచున్నాను.గృహస్థుడనైన నా ఇంటిలో అన్నమును భుజించి నన్ను ఉద్ధరించుము.నీవు నాయందు దయయుంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించితివి.మూడు లోకములకు భయమును కల్గించు నీకు భయమెక్కడిది? భయమను మిషతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చితివి.నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికితిని.నాకు పరలోకము సిద్ధించును. త్వద్దర్శన దానముతో నాకభయ దానము, దానితో ప్రాణ దానము, దానితో పరలోక దానము సంభవించినవని విన్నవించుచున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాసమహాముని ఆనందముతో, రాజా! ప్రాణములను రక్షించు వాడు తండ్రియని చెప్పబడును. నీచేత నాప్రాణములు రక్షించబడినవి. నాకు తండ్రివి నీవే.నేను నీకిప్పుడు నమస్కారము చేసినయెడల నీవు దుఃఖించెదవు.తండ్రికి కష్టము కలిగెడు వ్యాపారము చేయగూడదు. నీకు నమస్కారమును చేయను.బ్రహ్మణ్యుడనైన నేను నీకు గొప్ప కష్టమును కల్గించితిని.దానికి ఫలమును అనుభవించితిని.చివరకు నీవు దయతో ఆ కష్టము నివారించితివి. రాజా! నీతో కూడా భుజించెదనని దుర్వాసుడు ధర్మబుద్ధి గలవాడై ధర్మ వేత్తయైన అంబరీషునితో గూడి భుజించెను. సాక్షాత్తూ శివ రూపుడైన దుర్వాసుడు విష్ణు భక్తునియొక్క మహాత్మ్యమును పరీక్షించ గోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై తన ఆశ్రమమునకు వెళ్ళెను. కార్తీకకమాసమునందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము. సమస్త ఫలప్రదము. సమస్త యజ్ఞ ఫలప్రదమగును. కార్తీకమాసమందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసమాచరించి జాగరణముండి ద్వాదశినాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడగును. మోక్షమును గోరిన విష్ణు భక్తులు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడువక ద్వాదశి ఘడియలలోనే పారణ చేయవలయును.కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము.కనుక దానిని ఎంతమాత్రము విడువరాదు.కార్తీకక శుక్ల ద్వాదశియందు చేసిన పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము. ఈ పుణ్య కథను వినువారు పాప విముక్తులై అనేక భోగములననుభవించి అంతమందు పరమపదము పొందుదురు. ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ఏకోనత్రింశాధ్యాయ సమాప్తః!!

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి సద్యోదాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ ‘అదేమిటి? బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు. బ్రహ్మగారు ‘నేనే ఈ లోకములన్నిటిని సృష్టించాను నేనే నిక్కపు కర్తను. నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను. నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. నాకన్నా బ్రహ్మమెవరు? నేనే బ్రహ్మమును’ అన్నాడు. పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా! నా అంతవాడిని నేను అంటున్నావు. నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మమును నేను’ అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదములని పిలుద్దాం అని వేదములను పిలిచారు. ఋగ్వేదం ‘ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేస్తే మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవరు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము’ అంది. యజుర్వేదమును పిలిచారు.’ఆసురీశక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు.జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము’ అని చెప్పింది. తరువాత సామవేదమును పిలిచి అడిగారు.’మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతు తనలో తాను రమిస్తూ ఉన్న శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. అధర్వణ వేదము ‘ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది.అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. నాలుగు వేదములు అదే చెప్తున్నాయి. ప్రణవాన్ని పిలిచారు. ప్రణవం ‘ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై, శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది. ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు.ఈ మాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది.ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది.జ్యోతి సాకారం అయింది.సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. బ్రహ్మ-’నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు. ఆయన దండింపబడాలి.ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘ఏమి నీ ఆజ్ఞ?’ అని మొదటి రూపమును అడిగాడు.‘అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అంది.ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై అయిదవతలను గోటితో గిల్లేసింది.ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు పట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ‘ఈశ్వరా! నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు’ అన్నాడు. శంకరుడు కాలభైరవునితో, ‘నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు.కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక.నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది.నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది.ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను.నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. పుట్టేప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకం అంతా గజగజలాడిపోయింది.నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు.ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బ్రతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు.దీనిని ‘భైరవ యాతన’ అంటారు. జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు.కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు. ఇకనుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు.భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేసెయ్యి.నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను.నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను.నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు. అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు కనుక, ‘అయ్యా! నాకు లోపలికి ప్రవేశింపచేసి నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు.కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి. ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవయాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళితే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు.అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది.అక్కడితో పాపాలు పోతాయి.ఈవిధంగా ఆనాడు పరమేశ్వరుడు కాలభైరవుడికి ఇన్ని వరములను గుప్పించాడు.ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు.ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవదర్శనంగా భయంకరంగా కనపడతాడు. ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. ‘మేము కాశీ వెళ్ళాము – మాకు ఇంక ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది. ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో భక్తితో ప్రణమిల్లుతున్నారో, ఒక్కసారి నమస్కరిస్తున్నారో అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు.కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर

🌼🌿🕉️ *బిల్వాష్టకం - బిల్వ పూజ* 🕉️🌼🌿 *మాస శివరాత్రి సందర్భంగా లక్ష్మీ ఆధ్యాత్మిక గ్రూప్ సభ్యులకు ప్రత్యేకంగా* శివ పూజకు అత్యంత శ్రేష్ఠమైనది మారేడు ఆకు. దీనినే సంస్కృతంలో బిల్వ పత్రం అంటారు. మారేడు చెట్టుకి వచ్చే ఆకులు విశేషమైన ఆకారం లో ఉంటాయి. మూడు ఆకులు ఒక సమూహంగా ఉంది కాబట్టి త్రిదళం అని పేరు పొందాయి . ఇది మూడు గుణాలకు ప్రతీకగా (సత్వ రజస్తమో గుణములు), పరమశివుని మూడు కన్నులుగా, మూడు జన్మల పాపాన్ని హరించేదిగా చెప్పబడింది. ఈ బిల్వపత్రాలు ఎండినా కూడా పూజలో వినియోగించ వచ్చు. మారేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ *బిల్వపత్రాల మహిమ గురించి రాసిన బిల్వాష్టకం తాత్పర్యం మీకోసం.* 🌿 త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం మూడు దళాలు కలిగిన, మూడు గుణాలకు ప్రతీకగా, మూడు కన్నులవలె, మూడు ఆయుధాలుగా, మూడు జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం మూడు శాఖలు కలిగి, రంధ్రములు లేని, కోమలంగా, శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను. 🌿 అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం ఛిద్రం కాని ఒక్క పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగి వేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్ సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే, సోమ యాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం కోటి ఏనుగుల దానం ఫలం, నూరు యజ్ఞాల ఫలం, కోటి కన్యాదానాల ఫలం తో సమానమైన ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం లక్ష్మీ దేవీ స్తన్యము నుండి జన్మించిన, శివునికి ఎంతో ప్రియమైన, బిల్వ వృక్షం ఇచ్చిన దానితో సమానమైన బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం దర్శనం, స్పర్శనం వలన మహా పాపాలను నాశనం చేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం కాశీ నివాసం, కాల భైరవుని దర్శనం, ప్రయాగలో మాధవుని చూసిన తర్వాత బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, కొసలో శివుని కలిగిన బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. 🌿 ఫలశృతి బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్ ఫలశృతి: శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టకం పఠనం చేయటం వలన పాపాలు తొలగి, పుణ్యం కలిగి చివరకు శివలోక ప్రాప్తి కలుగుతుంది. 🚩 *ఓం నమఃశివాయ* 🚩

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर