Kondapaturi Jayadev Jun 30, 2022

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 2 शेयर
Kondapaturi Jayadev Jun 30, 2022

ఆషాఢ మాస వైభవం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ◾ ◾ సూర్యుడు ఈ మాసంలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటినుంచే దక్షిణాయానం ప్రారంభమవుతుంది.తొలి ఏకాదశి పర్వదినం వస్తుంది. మహాభారతాన్ని రచించిన వ్యాసుభగవానుడిని ఆరాధించే రోజే ఆషాఢపౌర్ణమి దీన్నే గురుపౌర్ణమిగా వ్యవహరిస్తారు. ఈ మాసంలో చాతుర్మాస్య వ్రతదీక్షలు ప్రారంభమవుతాయి. తొలి ఏకాదశి నాడు క్షీరసాగరంలో పవళించిన శ్రీ మహావిష్ణువు విశ్రమిస్తాడు.దీంతో తొలి ఏకాదశిగా భక్తితో దీక్ష చేపడుతారు. ఎంతో విశిష్టత కలిగిన సికింద్రాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర కూడా ఈ నెలలోనే వైభవంగా జరుగుతుంది. ఎంతో విశిష్టత, ఆధ్యాత్మికం కలిసిన విశిష్టమైన మాసం ఆషాఢమాసం. ఇక ఆషాఢంలో గుర్తుకు వచ్చేది గోరింటాకు. ఆషాఢంలో గోరింటాకు కొత్తా చిగురిస్తుంది. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువు. దాన్ని చేతులకు పెట్టుకుంటే కొత్త ఉత్తేజం వస్తుంది. ◾ ◾ మరి ఎందుకు దీన్ని శూన్యమాసం అంటారు ? పెళ్లి ఎన్ని నెలలైనా వాయిదా వేస్తారు కానీ ఆషాఢంలో మాత్రం వివాహాలు చెయ్య‌రు. అలాగే ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన కోడలు, అత్తగారింట్లో ఉండకూడదనే ఒక నమ్మకమూ ఉంది. దీనికి కొన్ని కారణాలున్నాయి. ఆషాఢంలో భార్యాభర్తలు కలిస్తే గర్భం వస్తుంది. ఆ సమ‌యంలో గర్భం వస్తే వేసవిలో కాన్పు ఉంటుంది.అంటే వేసవిలో బిడ్డకు జన్మనివ్వడంతో ఎండ తీవ్రతకి బిడ్డకు, తల్లికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఆషాఢంలో భార్యను దూరంగా పెడతారు. ఆరోగ్యంపరంగా ఆషాఢం అనుకూలం కాదు. జలుబు, జ్వరంలాంటివి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో భార్యాభర్తలు కలిస్తే ఆ ప్రభావం పిండంపై పడుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఒక సంప్రదాయం పేరు చెప్పి భార్యాభర్తలను వేరుగా ఉంచుతారు. ఆషాఢంలో భార్యాభర్తలిద్దరూ పూజలతో గడపమంటారు. ◾ ◾ ఆషాఢ మాసం శుభకార్యాలకు మంచిది కాకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవ వంటి పెద్దపెద్ద శుభకార్యాలకు ఇది మంచిది కాబట్టి ఆలయాలు భక్తులతో రద్దీగా ఉంటాయి. పండితులంతా పూజల్లో ఉంటారు. దీంతో వాళ్లు పెళ్లి తంతు చేయడానికి సమయం ఉండదు కనుక ఆషాఢంలో పెళ్లిళ్లు చేయరు. అలాగే ఆషాఢంలో దేవుళ్లు నిద్రలోకి వెళ్తారట. దీంతో వివాహం చేసుకుంటే వారి ఆశీస్సులు అందవట. దక్షిణ భారతంలో ఆషాఢంలో ఏ పంట చేతికిరాదు. వివాహం చేయడానికి ఈ సమయంలో డబ్బు ఉండదు. దీని వల్ల కూడా ఆషాడంలో వివాహాలు జరగవు. ఆషాఢంలో గాలి వానలు ఎక్కువ. దీంతో వివాహాలకు ఆటంకాలు వస్తాయి. అందుకే ఆషాఢంలో వివాహాలు నిర్వహించరు.

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Kondapaturi Jayadev Jun 29, 2022

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 13 शेयर
Kondapaturi Jayadev Jun 29, 2022

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 13 शेयर
Kondapaturi Jayadev Jun 29, 2022

🙏🌺పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక #చక్రవాకపక్షి ఉండేది. అది ప్రతిరోజూ ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశమార్గాన అలా అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది.🌺🙏 🌺అంత దూరం ప్రయాణించి మిట్టమధ్యాహ్న సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తుండేది. ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడిఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకొనేది. ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది. అలా చాలాకాలం గడిచింది. కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది. ఇతర పక్షులలాగా మరణానంతరం కూడా నరకయాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది. రెండు కల్పాలపాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది. ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగశిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది. పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు. పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్ద రాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు. బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది. భూత, భవిష్యత్తు వర్తమానాలు ఆయన కళ్లెదుట ఎప్పుడూ కనిపిస్తుండేవి. బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకొన్నాడు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలందుకున్నాడు.🌺 🌺వీటన్నిటితోపాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేవి. అతడి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆనోటా ఆనోటా ప్రజల అందరికీ చేరాయి. గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటిశక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతుండేవారు. అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒక రోజు రాజు దగ్గరకు బయలుదేరారు. మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకారభావాన్ని కొంచమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్లి నమస్కరించి, పూజించి, అతిథి సత్కారాలను చేసి, ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు. యోగక్షేమపరామర్శలు అయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత, పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు. ప్రదక్షిణ ఫలితమే అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా, అందులో పెద్ద రహస్యమేమీ లేదని, తాను ఆ శక్తుల సాధనకోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు, క్రతువులు కూడా ఏవీ లేవన్నాడు. ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది. వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్లీ చెప్పసాగాడు. గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు. ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చి పెట్టి రెండు కల్పాలపాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు. తనకు లభించిన శక్తులు, భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని, జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మాహాత్మ్యం ఉందని బృహద్రథుడు చెప్పాడు. కాశీ అన్నపూర్ణావిశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి.🌺 🌺కాశి నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది. కాశీ వెళ్లినప్పుడు తప్పకుండా విశ్వనాథ,అన్నపూర్ణ మందిర ప్రదక్షిణం చేయండి. కాశీ మహానగరం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. కాశీలో మరణించిన కుక్క కూడా స్వర్గానికే వెళుతుందన్నది నమ్మకం. కాశీ మహానగరంలో ఉండే అన్నపూర్ణమ్మ తల్లి, విశ్వేశ్వరుడు నమ్మిన భక్తులకు కొంగుబంగారం లాంటివారు.🌺

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर
Kondapaturi Jayadev Jun 29, 2022

పూర్వ/ఉత్తరాషాఢ నక్షత్రముతో కూడిన పూర్ణిమ వచ్చే మాసం ఆషాఢము. ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసములు ఆధ్యాత్మికంగా గొప్పవని శాస్త్రములందు చెప్పబడింది. ఆషాఢమాసం శూన్యమాసంగా పెళ్ళిళ్ళు మొదలైన వాటికి పనికిరాకపోయినప్పటికీ ఆధ్యాత్మిక సాధనకు చాలా ముఖ్యమైనది. జగమంతా వ్యాపించిన జగన్నాథుడే స్వయంగా పురుషోత్తముడిగా సుభద్రా, బలభద్రా సమేత సుదర్శన స్వాములతో కలసి ప్రజల వద్దకు వచ్చి జాతర చేసుకునే జగన్నాథ రథయాత్ర కూడా ఈ మాస విశేషములలో ప్రధానమైనది. ఆధ్యాత్మికతావు ఏ మాత్రం పురోగతి ఉండాలన్నా అవసరమైన గురువులను పూజించుకునే గురుపూర్ణిమ, చాతుర్మాస్యవ్రత ప్రారంభం, కర్కాటక సంక్రమణం ఇలా ఎన్నో ముఖ్యమైన వాటిని కలబోసుకొని ఉన్నది ఈ మాసం. శరన్నవరాత్రులు, వసంతనవరాత్రుల వలె ఆషాఢ నవరాత్రులు కూడా దేవీ పూజకు ప్రధానమైనవి. ఈ నవరాత్రులలో అమ్మవారి క్రియాశక్తిరూపమైన వారాహీదేవిని పూజించడం సంప్రదాయం. దానాలలో ఈ నెలలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈమాస ప్రారంభం నుండి రైతులకు ఆశాజనకంగా తొలకరి వర్షాలు ప్రారంభమవుతాయి. కనుకనే ‘ఆషాఢస్య ప్రథమ దివసే” అని కాళిదాసు మేఘసందేశాన్ని ఆషాఢమాసంలో వచ్చే మేఘంతోనే ప్రారంభించారు.

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Kondapaturi Jayadev Jun 28, 2022

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Kondapaturi Jayadev Jun 28, 2022

పురాణాలలోని కొన్ని విషయాలను తెలుసుకొందాం! 1). తాటికి ఎవరి భార్య? జ : సుందుడు 2). అహం బ్రహ్మస్మి అను మహావాక్యం ఏ వేదంలోనిది? జ: యజుర్వేదం 3). దశరథుని గురువు ఎవరు? జ: వశిష్ఠుడు 4). లక్ష్మీదేవి సోదరుడు ఎవరు? జ: చంద్రుడు 5). ఆదిత్యహృదయాన్ని ఎవరు,ఎవరికి ఉపదేసించారు? జ: అగస్త్యుడు. శ్రీరామునికీ. 6). నరకాసురుడు ఏ రాజ్యాన్ని పాలించేవాడు? జ: ప్రాగ్జ్యోతిషపురం 7). ఆరుముఖాలు గల దేవుడెవరు? జ: కుమారస్వామి 8). హేమలత అని ఎవరికి పేరు? జ: హిమవంతుని కుమార్తె, పార్వతీదేవి. 9). ఆదిశంకరులు జన్మించిన పుణ్యక్షేత్రమేది? జ: కాలడి 10). సంగీతానికి సంబంధించిన వేదం ఏది? జ: సామవేదం ( మరి కొన్ని మరో పోస్ట్లో చూద్దాం) వరలేఖరి.నరసింహ శర్మ.

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर