Dvsraju Jan 23, 2022

❤️పది నిమిషాలు తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సరళం అనిపిస్తుంది. ❤️పది నిమిషాలు సాధువులు, సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది. ❤️పది నిమిషాలు రాజకీయ నాయకుడి ముందు కూర్చుంటే మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది. ❤️పది నిమిషాలు జీవిత బీమా చేసే ఏజెంటు ముందు కూర్చుంటే చస్తేనే మంచిది అనిపిస్తుంది. ❤️పది నిమిషాలు వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ, దేనికీ సరిపోదు అనిపిస్తుంది. ❤️పది నిమిషాలు అధికారుల ముందు కూర్చుంటే ఈ ప్రపంచం మరీ స్లో అనిపిస్తుంది. ❤️పది నిమిషాలు శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే 💕మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది. ❤️పది నిమిషాలు ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్లీ విద్యార్థులం కావాలని అనిపిస్తుంది. ❤️పది నిమిషాలు రైతులు, కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మనం పడడం లేదనిపిస్తుంది. ❤️పది నిమిషాలు సైనికుల ముందు కూర్చుంటే 💕వారి ముందు మన త్యాగం, సేవల ముందు ఏమీ లేదనిపిస్తుంది. ❤️పది నిమిషాలు ఈ మెసేజ్ చదివితే 💕నేను దీన్ని ఇంకొకరికి ఫార్వర్డ్ చేయాలని అనిపిస్తుంది.

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर
Dvsraju Jan 23, 2022

❤️ *అపజయాల్ని పట్టించుకోవద్దు.అవి అత్యంత సహజం.* 💕 *ఒక్కోసారి అపజయాలే జీవితానికి అందాన్ని ఇస్తాయి.* 🌺 *పోరాటాలు లేని జీవితం అసలు జీవించదగినదే కాదు.* 💕 *జీవితంలో నవరసాలూ ఉంటాయి. బాధలే కీలకం.* 🌺 *ఏ విజయచరిత్రలోనూ అపజయం పాత్ర లేకుండా పోదు.* ❤️ *అపజయాల స్తంభాలమీద విజయభవనం నిలిచి ఉంటుంది.* 🌺ఎన్నో అపజయాలను చూసి పనిలోనే విశ్రాంతి పొందుతూ ప్రయోగశాలలోనే నిద్రపోయిన థామస్‌ ఆల్వా ఎడిసన్‌ చివరకు లోకాన్ని వెలుగులతో నింపాడు. ❤️ఎందుకూపనికిరాదనుకున్న నాచు పెన్సిలిన్‌గా మారి లోకరక్షకురాలవుతుందని ఫ్లెమింగ్‌ కలగనలేదు. 💕విజేతలందరి చేతుల్లో విజయాలు మాత్రమే రేఖలుగా గీసిలేవు. అపజయాల అష్టవంకరలు ఎన్నో ఉన్నాయి. వాళ్లు చేతుల్నికాక చేతల్ని నమ్మారు. జీవనగతిని మార్చుకున్నారు. విధిని ఎదిరించారు. 🌺ప్రయత్నించకపోవడమే పెద్ద లోపం. రింగులోలేని ఆటగాడు ఎన్నడైనా గెలిచాడా? మనసులో విజయాన్ని స్పష్టంగా చూడనివాడు జయకేతనం ఎగురవెయ్యలేడు. గెలుపు తర్ఫీదు పొందినవాడు మొదట మనసును జయిస్తాడు. ఆ తరవాత ప్రత్యర్థులను జయిస్తాడు. అర్జునుడికి ఈ స్పష్టత ఇవ్వడానికే శ్రీకృష్ణుడు సర్వప్రయత్నాలూ చేశాడు. విజయం సాధించాడు! ❤️వదలొద్దు. వదిలితే గెలవలేవు. వదిలితే విజయం నీది కాదు. వదిలినవాడు ఎన్నటికీ గెలవలేడు. పట్టి విడవరాదు. “పట్టు విడుటకన్న బరగ జచ్చుట మేలు”అన్నాడు వేమన. తన ప్రయోజనం కోసం రావణాసురుడు కూడా పట్టుదలతో వెయ్యి సంవత్సరాలు తపస్సుచేసి శివుణ్ని మెప్పించాడు. మహా శివభక్తుడని అనిపించుకున్నాడు. కైలాసాన్ని కదిలించాడు. 💕”అపజయాన్ని అసలు నమ్మకు. విజయానికి మారురూపమైన నన్ను నమ్ము” అని చెప్పకనే చెప్పాడు శ్రీకృష్ణుడు. బలహీనుడిగా మారిపోతున్నవాడిని మహాబలవంతుడిగా చేశాడు. అప్పుడు విజయం అంటే ఏమిటో, వీరస్వర్గం అంటే ఏమిటో, మరణ రహస్యం ఏమిటో, దాని కీలకం ఏమిటో క్షుణ్నంగా తెలుసుకున్నాడు అర్జునుడు. 🌺అడ్డులు, అవరోధాలు లేని ప్రయాణం బ్రహ్మపుత్రుడికైనా లభించదు. సీతాన్వేషణలో భగవంతుడైన శ్రీరాముడు లంకను దాటడానికి సముద్రుణ్ని ప్రార్థించవలసి వచ్చింది. ❤️మహా శక్తిమంతురాలు, జగజ్జనని అయిన సీతమ్మ అశోకవనంలో కాలం గడపవలసి వచ్చింది. 💕అపజయానికి వ్యతిరేక పదమైన హనుమంతుడు లంకలో సవాలక్ష చిక్కుల్ని ఎదుర్కోవలసి వచ్చింది. 🌺బంగారుపళ్లెంలో పెట్టి, ఎర్ర తివాచి పరచి, మన ముందుకు తీసుకువచ్చి విజయాన్ని ఎవరూ వినయంగా నిలబడి ఇవ్వరు. ❤️ఒకవేళ ఇచ్చినా అది విజయం కాదు. అది ఒక భ్రమ అయి ఉంటుంది. నిజమైన విజయాన్వేషి దాన్ని తెలుసుకోవాలి. 💕విజయానికి సూత్రాలు, సిద్ధాంతాలు ఉన్నా అది పూలబాట కాదు. రహదారి అసలు కానేకాదు. 🌺రథం కురుక్షేత్రం మధ్యలోకి నడిపించకుండా ఇంటి దగ్గర అర్జునుడికి ఎన్ని బోధలు చేసినా విజేత కాలేడు. ఎదురు వెళ్లాలి. రణరంగంలోకి దూకాలి. ఎదుర్కోవాలి. అపజయాలు ఎదురొచ్చినా స్వీకరించడానికి సిద్ధపడాలి. విషాద భారాన్ని మోయాలి. మానసిక ఆటుపోట్లకు కుంగిపోకూడదు. ❤️విజయం రాసిపెట్టి ఉన్నా దాని కోసం పడాల్సిన కష్టం కూడా రాసిపెట్టి ఉంటుందని మరిచిపోకూడదు. ❤️భూమ్మీదకు మనిషి వచ్చింది విజయోత్సవాలు చేసుకుంటూ బతకడానికి. సత్యం తెలుసుకొని కీర్తి పొందడానికి. 💕ఏం కావాలో స్పష్టంగా తెలిసిన తరవాత మన అడుగులు విజయంవైపే పడతాయి.

+5 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर
Dvsraju Jan 23, 2022

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Dvsraju Jan 23, 2022

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 4 शेयर
Dvsraju Jan 23, 2022

+7 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Dvsraju Jan 23, 2022

+11 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर
Dvsraju Jan 23, 2022

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 0 शेयर