SRINIVASASAI DURGA
SRINIVASASAI DURGA May 20, 2022

+8 प्रतिक्रिया 3 कॉमेंट्स • 18 शेयर

कामेंट्स

+6 प्रतिक्रिया 0 कॉमेंट्स • 9 शेयर
Eswar Tanikella Jun 28, 2022

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 13 शेयर
Eswar Tanikella Jun 28, 2022

శ్రీ దుర్గాద్వాత్రింశన్నామావళి * 🌼🌿🌼🌿🌼🌿🌼🙏 దుర్గా దుర్గార్తిశమనీ దుర్గా పద్వినివారిణీ | దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ ॥ ౧॥ దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా | దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోకదవానలా ॥ ౨॥ దుర్గమాదుర్గ మాలోకా దుర్గమాత్మస్వరూపిణీ । దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా || ౩ || దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ | దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థ స్వరూపిణీ ॥ ౪ || దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ । దుర్గమాంగీ దుర్గమతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ || ౫ || దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గదారిణీ | నామావళిమిమం యస్తు దుర్గాయా మమ మానవః ॥ పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః | శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి ద్వాత్రింశన్నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః || ౭ ||🙏☯️🕉️🌞🔱🚩

+3 प्रतिक्रिया 0 कॉमेंट्स • 3 शेयर
Eswar Tanikella Jun 29, 2022

భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్. విధానం ఈ శ్లోకమ్ రాత్రి 10 నుండి 2 గ మధ్యలో చేస్తే ఈ తల్లి తీర్చని సమస్య అంటూ ఉండదు..ముఖ్యంగా తగాదాలు, అనుకోకుండా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, శత్రు భయం, అనారోగ్య సమస్యలు ఇలా ఏదైనా ఈమె అనుగ్రహము తో పరిష్కరించబదుతుంది. అయితే ఈ తల్లి అనుగ్రహము కోసం ఈమెను రాత్రి పూట ఎక్కువగా ఆరాధించాలి. ఎవరు పఠించినా వారికి తీవ్రంగా ఉన్న కష్టాన్ని తొలగిస్తుంది..అకాల మృత్యువాత పడకుండా రక్షిస్తుంది. ఇక్కడ ఇచ్చిన ఈ దత్త మంత్రం ముందుగా మూడు సార్లు జపం చేసి దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేసి తర్వాత వారాహి మాత స్త్రోత్రం 3 సార్లు కానీ 16 సార్లు కానీ పారాయనఁ జపం చేయాలి.. దత్తాత్రేయ సర్వ బాధ నివారణ మంత్రం. "నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో || సర్వ భాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే||" భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్ అథ ధ్యానమ్ । వన్దే వారాహవక్త్రాం వరమణిమకుటాం విద్రుమశ్రోత్రభూషాం హారాగ్రైవేయతుఙ్గస్తనభరనమితాం పీతకౌశేయవస్త్రామ్ । దేవీం దక్షోర్ధ్వహస్తే ముసలమథపరం లాఙ్గలం వా కపాలం వామాభ్యాం ధారయన్తీం కువలయకలికాం శ్యామలాం సుప్రసన్నామ్ ॥ నమోఽస్తు దేవి వారాహి జయైఙ్కారస్వరూపిణి । జయ వారాహి విశ్వేశి ముఖ్యవారాహి తే నమః ॥ ౧॥ వారాహముఖి వన్దే త్వాం అన్ధే అన్ధిని తే నమః । సర్వదుర్ష్టప్రదుష్టానాం వాక్స్తమ్భనకరే నమః ॥ ౨॥ నమః స్తమ్భిని స్తమ్భే త్వాం జృమ్భే జృమ్భిణి తే నమః । రున్ధే రున్ధిని వన్దే త్వాం నమో దేవేశి మోహిని ॥ ౩॥ స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః । బాహ్వోః స్తమ్భకరీం వన్దే జిహ్వాస్తమ్భనకారిణీమ్ ॥ ౪॥ స్తమ్భనం కురు శత్రూణాం కురు మే శత్రునాశనమ్ । శీఘ్రం వశ్యం చ కురు మే యాఽగ్నౌ వాగాత్మికా స్థితా ॥ ౫॥ ఠచతుష్టయరూపే త్వాం శరణం సర్వదా భజే । హుమాత్మికే ఫడ్రూపేణ జయ ఆద్యాననే శివే ॥ ౬॥ దేహి మే సకలాన్ కామాన్ వారాహి జగదీశ్వరి । నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః ॥ ౭ ఇతి భక్త మనోరథ సర్వఫలప్రద శ్రీవారాహీ స్తోత్రమ్ సంపూర్ణం. 🙏☯️🕉️🌞🔱🚩 లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి

+5 प्रतिक्रिया 2 कॉमेंट्स • 12 शेयर

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-2 🌹* *🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻* *✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్* *సేకరణ : ప్రసాద్ భరద్వాజ* *మూల మంత్రము :* *🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁* *🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।* *రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀* *🌻 382. 'రహస్తర్పణ తర్పితా' - 2🌻* *శ్రీమాత పరతత్వమున కర్పితయై పరమానంద భరితయై యుండును. జీవులు శ్రీమాత అనుగ్రహమును పొందుటకు గాని, దైవ సాన్నిధ్యము చేరుటకు గాని, దైవానుగ్రహము పొందుటకు గాని, దైవమే తాముగ వైభవోపేతమైన జీవితమును జీవించుటకు గాని, సర్వోత్తమమైన మార్గము సమర్పణ మార్గము. ఈ మార్గ మత్యంత సాహసముతో కూడినది. దైవము నందు పరిపూర్ణ భక్తి విశ్వాసములు గలవారు మాత్రమే నిర్వర్తింపగలరు.* *అట్టి విశ్వాసము కూర్చువాడు కూడ దైవమే. కలియుగమున అనేకులు ఇట్టి సమర్పణ మార్గము ననుసరించి అనుగ్రహము పొంది, భూమిపై దైవమే తానుగ శాశ్వతముగ నిలచి జీవుల నుద్ధరించు చున్నారు. ఇట్టి మహాత్ములు ఎందరో హిమాలయములను కేంద్రముగ నేర్పరచుకొని జీవుల వృద్ధిని గూర్చి, సంవృద్ధిని గూర్చి కృషి సల్పుచున్నారు. మైత్రేయుడు, ఉద్ధవుడు, విదురుడు, సూర్య వంశపు క్షత్రియుడగు మరువు, చంద్ర వంశపు క్షత్రియుడగు దేవాపి మొదలుగ ఎందరో మహాత్ములు ఈ సమర్పణ మార్గమున దైవప్రతినిధులై భూమిపై దివ్యదేహములు దాల్చి చరించు చున్నారు.* *సశేషం...* 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 382 - 2 🌹* *Contemplation of 1000 Names of Sri Lalitha Devi* *✍️. Acharya Ravi Sarma * *📚. Prasad Bharadwaj* *🌻 83. Odyana pita nilaya nindu mandala vasini* *Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻* *🌻 382. Rahastarpaṇa-tarpitā रहस्तर्पण-तर्पिता -2 🌻* *Second is the mantra itself that infuses life to the visualized form. This situation is applicable only in the initial stages and as one progresses, further guidance is received from the concerned deity itself by way of communion. This nāma says that such mantra-s should be recited only mentally.* *There is another interpretation for this nāma. This nāma could also be interpreted as ‘secretive oblations’ offered into the internal fire (fire generated and persists at the mūlādhāra cakra to keep the body alive).* *Continues...* 🌹 🌹 🌹 🌹 🌹 #శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama https://t.me/+LmH1GyjNXXlkNDRl http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/ https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर
Eswar Tanikella Jun 29, 2022

🙏🌹శ్రీ వారాహి నవరాత్రి...🙏🌹 ఆషాఢమాసం – శ్రీ వారాహి నవరాత్రి మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు… అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి), ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది…ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం…ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది. వారాహి అనగా భూదేవి, ధాన్యలక్ష్మి…ఆవిడ తన చేతుల్లో నాగలి, రోకలి ధరించి ఉంటుంది…వీటిల్లోని ఆంతర్యం ఏంటంటే…రోకలి ధాన్యం నించి పొట్టు వేరు చేయడానికి వాడుతారు…అలగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది…నాగలి భూమిని విత్తనం వేసేముందు తయారు చేయడానికి వాడతాం..అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామకర్మ వైపు వెళ్ళేలాగా ప్రేరణ చేస్తుంది…. పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే, ఉగ్రం వారాహి…శ్రీ విద్యా గద్యంలో “అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే” అని లలితను కీర్తిస్తారు…దేవీ కవచంలో “ఆయూ రక్షతు వారాహి” అన్నట్టు…ఈ తల్లి ప్రాణ సంరక్షిణి….ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం ప్రకృతి పరంగా చూసినట్లైతే…ఈ సమయంలో వర్షం కురుస్తుంది…రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు…దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది… అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి…బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి…ముఖ్య ప్రాణ రక్షిణి…హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామాలు… -పంచమి -దండనాథా -సంకేతా -సమయేశ్వరి -సమయ సంకేతా -వారాహి -పోత్రిణి -వార్తాళి -శివా -ఆజ్ఞా చక్రేశ్వరి -అరిఘ్ని దేశం సుభిక్షంగా ఉండాలని…మనమంతా చల్లగా ఉండాలని…ధర్మం వైపు మనం నడవాలని…అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ….. సర్వం శ్రీవారాహి(దండిని) చారణారవిందార్పణమస్తు…! నవరాత్రులు ఈ నెల జూన్30 వ తారీకు నుండి మొదలవుతున్నాయి జులై8th తారీకు తో ముగుస్తున్నాయి.. 🙏శ్రీ మాత్రే నమః...🙏 వారాహి దేవి ఎవరు ? మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది. దుష్టశిక్షణ కోసమూ, భక్తులను కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. బ్రాహ్మణి, వైష్టవి, మహేశ్వరి, ఇంద్రాణి, వరాహి, కౌమారి, చాముండ, నరసింహీ, వినాయకీగా పిలవబడే సప్త మాత్రికల్లో ఒకరుగా వరాహ దేవి అమ్మవారిని చెబుతారు. పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్త మాత్రికలు. బ్రహ్మ నుండి బ్రాహ్మణి, విష్ణువు నుండి వైష్ణవి, పరమేశ్వరుని నుండి మహేశ్వరి, ఇంద్రుని నుండి ఇంద్రాణి, వరాహావతారం నుండి వరాహి, స్కంధ నుండి కౌమారీ, నరసింహావతారం నుండి నరసింహి, వినాయకుని నుండి వినాయకీ సప్త మాత్రికలుగా ఉద్భవించారు. వారిలోని వరాహి అవతారం ప్రత్యేకమైనది. ఆమె వరాహి దేవిగా పిలవబడుతూ, ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్ర పాలికగా కాపు కాస్తోంది. వరాహుని స్త్రీతత్వం పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. సైన్యాధ్యక్షురాలు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ... తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం. 🙏కాశీ క్షేత్ర పాలికే ఈ సప్తమాత్రిక..🙏 సాక్షాత్తూ పరమ శివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్ర పాలికగా వరాహిదేవిని కొలుస్తారట. చాలా చోట్ల శివుడే క్షేత్ర పాలకుడుగా ఉంటాడు. కానీ, ఆ పరమ శివునికే ఈ వరాహి దేవి క్షేత్ర పాలికగా ఉందన్న మాట. కాశీ పట్టణానికే కాదు, తంజావూర్ బృహదీశ్వరాలయానికీ ఈ మాత క్షేత్ర పాలికగా కాపలా కాస్తోందట. తంజావూర్ బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉంది. ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా, ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. ఆ రూపాన్ని చూడాలంటే, నిజంగా పెట్టి పుట్టాలంతే అన్నట్లుగా ఉంటుంది అమ్మవారి రూపం ఇక్కడ. అలాగే, కాశీ నగరంలో అయితే, నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే ఆరు చేతులూ శంఖు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. సప్త మాత్రికలందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట. అందుకే అమ్మను క్షేత్ర పాలిక అంటారు. చాలా శక్తివంతురాలిగా వరాహి దేవిని స్తుతిస్తారు. రాక్షసులను మట్టు పెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగానే ధైర్యసాహసాలకు ప్రతీకగా ఆమెను కొలుస్తారు. శ్రీ మాత్రే నమః 🙏🏻 ఈ వారాహి దీవి ద్వాదశనామ స్తోత్రం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైన త్వరగా పూర్తీ అవుతాయి అని చెప్తారు.. శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం .. అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః | అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా | శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం | సర్వ సంకట హరణ జపే వినియోగః || పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ | తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా 1 వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా | అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే 2 నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః | సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః 3 ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ||✍️ 🙏శ్రీ మాత్రే నమః...🙏 🙏☯️🕉️🌞🔱🚩 👉🙏🌹తంజావూరు ఆలయంలోని వారాహి అమ్మవారు. 👇

+2 प्रतिक्रिया 0 कॉमेंट्स • 7 शेयर

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-1 🌹* *🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻* *✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్* *సేకరణ : ప్రసాద్ భరద్వాజ* *మూల మంత్రము :* *🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁* *🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।* *రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀* *🌻 382. 'రహస్తర్పణ తర్పితా' - 1🌻* *ఏకాంతముగ పరమాత్మ తత్త్వము నెరింగి అంతరంగమున ప్రవేశించి రహస్యమున తనను తా నర్పించుకొని తన్మయము చెందు నది శ్రీదేవి అని అర్థము. తర్పణము అర్పణమే. అర్పణ తలమానికమగు గుణము. జీవితము తనదిగా కాక దైవమునది అని ఎఱిగి దైవమున కర్పించి జీవించుట నిజమగు సాధన. అది అత్యంత సాహసవంతము. దైవము కొరకే జీవించుట, దైవమునే ఆశ్రయించి యుండుట, దైవార్పితముగ జీవితము గడుపుట, సమస్తమునకు దైవమే ఉపాయమని భావించుట, ఆరాధించుట, దైవము దరిచేరుట, సంపూర్ణముగ తన మాన ప్రాణములతో సహా దైవమున కర్పణ చేయుట అర్పణ మార్గము.* *సమర్పణ మనగ నిదియే. ఇట్టి సమర్పణ అత్యంత రహస్యముగ నిర్వర్తించుకొనుట రహస్యార్పణ మగును. 'రహస్తర్పణ' మగును. అట్లు అర్పించు కొన్నవారి జీవితము నిరహంకారమై, దైవమున కత్యంత చేరువై, దైవానుగ్రహము నకు పాత్రమై నిలచును. అప్పుడు దైవ మందించు సాన్నిధ్యము పరిపూర్ణానందమును కలిగించి పరితృప్తి కలిగించును.* *సశేషం...* 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 382 - 1 🌹* *Contemplation of 1000 Names of Sri Lalitha Devi* *✍️. Acharya Ravi Sarma * *📚. Prasad Bharadwaj* *🌻 83. Odyana pita nilaya nindu mandala vasini* *Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻* *🌻 382. Rahastarpaṇa-tarpitā रहस्तर्पण-तर्पिता -1 🌻* *In the initial stage of pursuing spiritual path and in order to control the mind, recitation and repetition of mantra-s is practiced, so that the mind does not get diverted to extraneous thoughts. Such mantra-s should be recited after understanding the meaning of the mantra.* *In the case of Pañcadaśī mantra, there are fifteen bīja-s in that mantra and each bīja has different meaning and significance. This has been dealt with in the introductory chapter. Two things are important while reciting a mantra. The first one is dhyāna verse or the meditative verse that describes the form of the god or goddess. This helps in visualizing the form of the deity.* *Continues...* 🌹 🌹 🌹 🌹 🌹 #శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama https://t.me/+LmH1GyjNXXlkNDRl http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/ https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

+4 प्रतिक्रिया 0 कॉमेंट्स • 1 शेयर

भारत का एकमात्र धार्मिक सोशल नेटवर्क

Rate mymandir on the Play Store
5000 से भी ज़्यादा 5 स्टार रेटिंग
डेली-दर्शन, भजन, धार्मिक फ़ोटो और वीडियो * अपने त्योहारों और मंदिरों की फ़ोटो शेयर करें * पसंद के पोस्ट ऑफ़्लाइन सेव करें
सिर्फ़ 4.5MB